బిగ్ బ్రేకింగ్ : గంటా విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారా?

Sunday, June 9th, 2019, 09:53:11 PM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న పని తీరుపై మన రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది.ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు నుంచి జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రంలోని అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.ముఖ్యంగా అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తానని ముందే చెప్పిన జగన్ ఇప్పుడు అన్నట్టుగానే అడుగులు వేస్తున్నారు.మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు గత ఐదేళ్లలో చేసిన అవినీతిని వెలికి తియ్యడంలో ఇప్పుడు జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ టీడీపీ కీలక నేత అయినటువంటి గంటా శ్రీనివాసరావుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రాజాకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక వార్త సంచలనంగా మారింది.గడిచిన ఐదేళ్లలో విశాఖ జిల్లాలోని భూ దందాలు విపరీతమైన స్థాయిలో జరిగాయని అప్పట్లోనే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు పోరాటం చేసిన సంగతి తెలిసిందే.అప్పట్లో గంటా ఉన్న భీమిలికి సంబంధించి అతని అనుచర వర్గం పెద్ద ఎత్తునే అక్రమ భూసేకరణ చేసేశారని,కానీ అప్పుడు వారి అధికారమే ఉండడం వలన తగిన సాక్ష్యాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని కానీ ఇప్పుడు మాత్రం జగన్ అవన్నీ బయటకు లాగి ఈ భూదందా వెనుకున్న ప్రతీ ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించేందుకు ఆదేశాలు జారీ చేసారని దీని వెనుక ఎంతటి వారున్నా సరే జైలుకు వెళ్లడం ఖాయమని కూడా తెలుస్తుంది.దీనితో మొత్తానికి జగన్ గంటాకు సరైన స్కెచ్ వేశారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.