బిగ్ న్యూస్ : వంగవీటి రాధా విషయంలో జగన్ సంచలన నిర్ణయం.?

Wednesday, December 4th, 2019, 08:08:16 AM IST

గత ఏడాది వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన కీలక నేతల్లో వంగవీటి రాధా కూడా ఒకరు.తాను వెళ్లడం వెళ్తూనే జగన్ మరియు వైసీపీ పార్టీలపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసారు.అయితే ఆ పార్టీలో తాను ఆశించింది దక్కకపోవడంతో బయటకు వెళ్లిపోయారు బాగానే ఉంది కానీ బయటకు వెళ్ళాక మాత్రం ఆయనకు ఏమన్నా ఒరిగిందా అంటే అది కూడ లేదు.టీడీపీలోకి వెళ్లారు అక్కడ సరైన స్థానం దక్కలేదు.తర్వాత జనసేన లోకి వెళ్తారనుకున్నారు అక్కడ కూడ పెద్ద క్లారిటీ లేదు.

దీనితో ఇప్పుడు రాధ పరిస్థితి కాస్త అయోమయంగానే ఉంది.అయితే ఇప్పుడు ఎందుకో మళ్ళీ వైసీపీలోకి వంగవీటి రాధా మళ్ళీ వెళ్తారన్న సూచనలు కనిపించేలా ఉన్నాయని అంతర్గతంగా టాక్ వినిపిస్తుంది.దీనిపై సరైన క్లారిటీ రాలేదు కానీ ఒకవేళ రాధా కానీ మళ్ళీ వైసీపీలోకి వస్తే చేర్చుకునేందుకు వైసీపీ సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈ విషయాన్ని ఇదే వైసీపీలో మరో పవర్ ఫుల్ నేత అయినటువంటి మంత్రి కొడాలి నానియే ప్రస్తావించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరి రాధా విషయంలో జగన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అదే సంచలనంగానే మారుతుంది అని చెప్పాలి.అలాగే రాధను జగన్ చేర్చుకున్నా మనం పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు.ఒకవేళ అభిమానులు వద్దని గుడ్డలు చింపుకున్నా వారు చేసేది కూడా ఏమీ ఉండదు.ఎందుకంటే గతంలో జగన్ పై రాధా కంటే దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారినే జగన్ ఇప్పుడు అక్కున చేర్చుకుంటున్నారు.ఇప్పుడు రాధను చేర్చుకున్నా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పొచ్చు.