టీటీడీ చైర్మన్ గా జగన్ బంధువు…?

Wednesday, June 5th, 2019, 11:12:30 PM IST

గత కొంత కాలంగా నేతలను ఉరిస్తున్నటువంటి టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు… ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును జగన్ ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు కారణం వారిరువురు కూడా దగ్గరి బంధువులే అని సమాచారం. వైవీ సుబ్బారెడ్డికి జగన్ కుటుంబంతో సన్నిహిత బంధుత్వం ఉంది.అంతేకాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల్లో వైవీ సుబ్బారెడ్డి ఒకరు. కానీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ అనుకోని పరిస్థితుల్లో ఒంగోలులో మాగుంట శ్రీనివాసులురెడ్డికి సీటు ఇచ్చిన జగన్, వైవీని పట్టించుకోలేదు. కాగా ఎన్నికల్లో మాగుంట ఘనవిజయం సాధించడంతో అందరు కూడా జగన్ నిర్ణయం సరైనదే అని నిర్ణయించుకున్నారు. కానీ వైవి విషయంలో కాస్త అన్యాయం జరిగిందని పలువురు సూచించడంతో ఈ టీటీడీ చైర్మన్ పదవి అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతానికి వైవీ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల ఇన్ చార్జిగానూ వ్యవహరించారు. కాగా, వైవీని రాజ్యసభకు పంపిస్తారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఖరారు కావడంతో ఆ ప్రచారానికి తెరపడినట్టే భావించాలి.