రెడ్డిలపై జగన్ కొత్త ప్లాన్ – ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి మరి…

Wednesday, June 12th, 2019, 09:50:13 PM IST

ఏపీలో కొత్తగా ఎన్నికైనటువంటి కేబినెట్ లో మంత్రులుగా అవకాశం దక్కలేదని ఆవేదనతో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించి బంగపడ్డ వారికి జగన్మోహన్ రెడ్డి కొన్ని కొత్త పెదవులని అప్పగిస్తున్నార్నయి సమాచారం. ఈ మేరకే మహిళా కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ ( ఏపీ పారిశ్రామిక, మౌలిక వసతుల అభివద్ధి సంస్ధ) ఛైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మనగళగిరి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై పోటీ చేసి గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ ఛైర్మన్ పదవి అప్పగించనున్నారని సమాచారం. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ప్రభుత్వ విప్ పదవులు అప్పగించారు.

అయితే రెడ్డి సామజిక వర్గం పై జగన్ చేసిన ప్రయత్నాలు దాదాపుగా ఫలనచినట్లే కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి… వారందరికీ కూడా ప్రత్యేకమైన నామినేటెడ్ పదవులు ఇస్తూ మరీ అందరిని బుజ్జగిస్తున్నారు సీఎం జగన్. అంతేకాకుండా వారందరికీ కూడా మరోసారి ఏర్పాటు చేసే మంత్రివర్గ కూర్పులో అవకాశం ఇవ్వనున్నారు. అందుకనే జగన్ నిర్ణయాన్నే తమ నిర్ణయంగా భావించినటువంటి రెడ్డి సామాజికవర్గానికి చెందిన అసంతృప్తి ఎమ్మెల్యేలు పిన్నెల్ని రామకృష్ణారెడ్డితో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయభాను, బోయ సామాజిక వర్గానికి చెందిన కాపు రామచంద్రారెడ్డికి సైతం విప్ లుగా నియమించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇలాగె అసంతృప్తిగా ఉన్నటువంటి మరికొందరు ఎమ్మెల్యేలకు కూడా ఇలాగె నామినేటెడ్ పదవులు ఇచ్చి మరీ అందరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.