వైసీపీ నేతలకే చుక్కలు చూపిస్తున్న జగన్ సంచలన నిర్ణయం.!

Thursday, February 6th, 2020, 07:06:16 AM IST

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వై ఎస్ జగన్ తీసుకున్న పలు నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయానికి తానా అంటే తందానా అనే బ్యాచ్ కూడా అన్ని పార్టీల్లో ఉన్నట్టే ఉన్నారు.అలా జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని వెనకేసుకు వచ్చే వారు అనేక మంది ఉన్నారు.

అలాగే జగన్ తీసుకున్న నిర్ణయాల మూలాన ఇప్పుడు తలలు పట్టుకున్న నేతలు కూడా చాలా మందే ఉన్నట్టు తెలుస్తుంది.తాజాగా మండలి రద్దు అంటూ జగన్ ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.దీనితో వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చెయ్యగా అదే ఎమ్మెల్యే సీట్లు ఆశించి ఎమ్మెల్సీతో అయినా సరిపెట్టుకుందామనుకున్న పలువురు నేతలు ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నారట.

అందులోను జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారని సమాచారం.అందులో గుంటూరు జిల్లా నుంచే ఏకంగా ఐదుగురు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం మూలాన తమకున్న ఎమ్మెల్సీ పదవులు కూడా పోయేలా ఉన్నాయని ఈ నిర్ణయం మూలాన టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ నష్టం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.