బిగ్ బ్రేకింగ్ : టీడీపీకు లాభం చేకూర్చిన జగన్ సంచలన నిర్ణయం.!

Tuesday, August 13th, 2019, 10:25:32 AM IST

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం కోసం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక విస్తృత చర్చ జరగుతుంది.జగన్ తన పార్టీకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వలన తెలుగుదేశం పార్టీకు బాగా కలిసొచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.ఇదెలా అంటే గత 2014 ఎన్నికలు జరిగిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొన్నట్టుగా చంద్రబాబు కొనేసాడని అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసారు.

కానీ ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం చంద్రబాబు చేసిన తప్పును తాను చెయ్యనని ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసలు ప్రోత్సహించనని తెలిపారు.ఇందులో భాగంగానే తమతో ఇప్పుడున్న 23 మంది ఎమ్మెల్యేలలోను మరియు ఓటమి పాలైన వారు కూడా జగన్ ఒక్క సైగ చేస్తే వైసీపీలోకి వచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.కానీ జగన్ పెట్టిన షరతు వల్లే టీడీపీ నుంచి ఎవరు బయటకు వెళ్లలేదని ఇదే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలా ప్లస్సయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.

టీడీపీ నుంచి వైసీపీకు వెళ్లాలంటే ముందుగా టీడీపీకు రాజీనామా చేసేసే వెళ్లాలని కానీ బీజేపీలోకి అయితే అలాంటివి ఏమి లేకుండానే బీజేపీలోకి చేరిపోతున్నారని ఎలాగో బీజేపీలో అంటే కేవలం ఓటమి పాలైన వారు చేరాలని కానీ పదవుల్లో ఉన్న వారు మాత్రం చేరలేరని ఈ విధంగా జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం టీడీపీకు బాగా ప్లస్సయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.