ఇప్పుడు జగన్ టార్గెట్ అదేనా…?

Wednesday, June 5th, 2019, 12:18:36 AM IST

ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి కాస్త శత్రువుల బెడద ఎక్కువగానే ఉన్నట్లుంది. ఎప్పటినుండో శత్రువులను ఎదురించేందుకు ఆయన పోరాటం ప్రారంభించాడు. గత పది సంవత్సరాలుగా తానూ సాధించిన విజయాపజయాలను పక్కనపెడితే జగన్ మాత్రం ఎంతో ధైర్యాన్ని సంపాదించుకున్నాడని చెప్పుకోవాలి… ఎపుడు వెన్ను చూపని ధైర్యం. కానీ ఇపుడు ప్రస్తుతానికి జగన్ సాధించిన విజయం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది అని చెప్పాలి… అందరి అంచనాలను తలదన్ని మరీ జగన్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాడు…

అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి కూడా ప్రత్యర్థులనుండి అనేక విమర్శలు వస్తున్నాయి… ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ, వ్యతిరేకించిన బీజేపీ రాజ్యసభ సబ్యుడు జీవీఎల్ నరసింహ రావు ఇపుడు జగన్ మీద ద్రుష్టి పెట్టారు. అధికారాన్ని దక్కించుకొని 10 రోజులైనా గడవకముందే తీవ్రారోపణలు రేగుతున్నాయి… అందుకోసమని జివిఎల్ సోషల్ మీడియా ని టార్గెట్ చేసుకున్నారు… కాగా గుంటూర్లో జగన్ ముస్లింలకు ఇచ్చిన ఇఫార్ విందు కి 1.1 కోట్లు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. ఏపీ అసలే అప్పుల్లో ఉందని, నిన్నటి సీఎం చంద్రబాబు విలాసాలకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారని, మరి జగన్ కూడా అదే బాటలో నడిచి పెద్ద ఎత్తున మత పండుకలు ఖర్చు చేయడం ఏంటని నిలదీశారు.