కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన జగ్గూభాయ్ ?

Sunday, April 1st, 2018, 02:02:20 PM IST

సినిమా రంగంలో అమ్మాయిలకు జరిగే లైంగిక వేధింపుల విషయం ఇప్పటికే రచ్చ రచ్చ అయినా విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు భామలు ఈ విషయంపై బహిరంగానే స్పందించారు. తాజాగా ఈ విషయం పై టాలీవుడ్ లోకూడా పెద్ద రచ్చ నడుస్తుంది. ఈ విషయం పై ప్రముఖ నటుడు జగపతి బాబు స్పందించాడు. అమ్మాయిలపై లైంగిక వేధింపులు ఒక్క సినిమా పరిశ్రమలోనే లేవని, అన్ని రంగాల్లో ఆడవాళ్లపై ఈ వేధింపులు జరుగుతున్నాయని అన్నాడు. ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువగా చర్చ జరుగుతుందని అన్నారు. ఎవరైనా సరే సన్నిహితంగా ఉంటేనే అవకాశాలు ఇస్తామని అంటే అందుకు అమ్మాయిలు గట్టిగా నిరాకరించాలని చెప్పారు. సినిమా రంగం సురక్షితమైందే అని అయన అభిప్రాయం పడ్డారు. సినిమాల్లోకి తన కుమార్తెలు వస్తానంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తానే మా అమ్మాయిని సినిమాల్లోకి రావొచ్చుకాడా అని అడిగానని చెప్పాడు. అయితే వారికి సినిమా రంగంలోకి రావడం ఆసక్తి లేదని చెప్పాడు.