బాలీవుడ్ లోకి జగ్గు భాయ్

Sunday, April 15th, 2018, 11:39:48 AM IST

ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమా ద్వారా హీరో స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతి బాబు. ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు అంటే చాలు ఎలాంటి పాత్ర చేయబోతున్నారు అని ఆసక్తి ప్రేక్షకుల్లో క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం జగపతి బాబు ఇతర భాషల్లో కూడా కొన్ని సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ లో నటించడానికి రెడీ అయ్యారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేయబోయే దబాంగ్ 3లో జగ్గు బాయ్ విలన్ గా కనిపించనున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల ఎండింగ్ లో స్టార్ట్ కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఎండింగ్ కు వచ్చేశాయి. విలన్ గా జగపతి బాబు బెస్ట్ అని ప్రభుదేవా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మీడియా ద్వారా చిత్ర యూనిట్ నటీనటుల వివరాలను బయపెట్టనుంది.

  •  
  •  
  •  
  •  

Comments