ఆనందయ్య మందు వాడిన వాళ్ళలో నేనూ ఒకడిని – జగపతి బాబు

Monday, June 7th, 2021, 05:41:28 PM IST


కరోనా వైరస్ మహమ్మారి కి ఆనందయ్య ఆయుర్వేద మందు పై మొదటి నుండి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే అంతకుముందు ఈ ఆయుర్వేద మందు కి ప్రభుత్వం అనుమతులు రావాలని కోరిన ప్రముఖ నటుడు జగపతి బాబు తాజాగా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే ఆనందయ్య తయారు చేసిన కరోనా ఔషధాన్ని తాను ఎప్పుడో వాడినట్లు జగపతి బాబు అన్నారు. అయితే ఆయన తయారు చేసిన ఆయుర్వేద మందు వాడిన వాళ్లలో తాను కూడా ఒకడిని అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం చెబుతున్నా అంటూ మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయుర్వేదం తప్పు చేయదని నా నమ్మకం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రకృతి, భూదేవి తప్పు చేయవు అని వ్యాఖ్యానించారు. అయితే ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలుసుకున్న తర్వాత అంతా మంచే జరుగుతుంది అని మొదటి డోస్ తీసుకున్నా అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకూ కూడా తనకు కరోనా వైరస్ రాలేదు అని జగపతి బాబు అన్నారు.