జ‌గ్గారెడ్డి :కోమ‌టిరెడ్డి భార్య ఓట‌మికి కార‌ణం అదే..!

Tuesday, June 4th, 2019, 12:53:06 PM IST

ఇటీవ‌ల తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ తూర్పు ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో డ‌బ్బు ప్ర‌భావం చూపింద‌ని చెప్పుకొచ్చారు.
కోమ‌టిరెడ్డి సోద‌రుల వ‌ద్ధ డ‌బ్బు లేదు కాబ‌ట్టే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యార‌ని, లేదంటే ఖ‌చ్చింత‌గా గెలుపొందేవార‌ని జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు అధికార పార్టీకి అనుకూలంగా వ‌స్తాయ‌న్నది అంద‌రికి తెలిసిందే ఇందులో గొప్పేముందని తెరాస వ‌ర్గాల‌ను దుయ్య‌బ‌ట్టారు.

అయితే జ‌డ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నిక‌ల్లో మాత్రం ఈ ఫ‌లితం పున‌రావృతం కాద‌ని, కాంగ్రెస్ హ‌వా క‌నిపిస్తుందని. పోటీ ర‌స‌వ‌త్త‌రంగా వుంటుంద‌ని జోష్యం చెప్పారు. శాస‌న మండ‌లిలో అధికార ప‌క్షానికి 35 మంది ఎమ్మెల్సీలు వున్నా వారంద‌రిని క‌ట్ట‌డి చేయ‌డానికి ఒక్క జీవ‌న్‌రెడ్డి చాల‌ని స్ప‌ష్టం చేశారు. హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఉత్త‌మ్ కుటుంబ స‌భ్యులే పోటీకి దిగితే గెలుపు సునాయాస‌మ‌వుతుంద‌ని, అలా కాకుండా మ‌రొక‌రికి టికెట్ ఇస్తే ఆ స్థానాన్ని వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌ని కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చ‌రించే ప్ర‌యత్నం చేశార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.