అవును..మా ఇద్దరి లవ్ జర్నీ మొదలైంది..!

Sunday, February 19th, 2017, 01:00:48 AM IST


జర్నీ చిత్రంతో పరిచయమైన హీరో జై, హీరోయిన్ అంజలి ప్రేమలో ఉన్నారంటూ గతం లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ నిజమే అని తేలిపోయింది. జై, అంజలి లు తాజాగా నటించిన చిత్రం బెలూన్. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా జై వారిమధ్య యున్న రిలేషన్ ని ప్రకటించాడు. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అని మీడియా ప్రశ్నించగా జై అవునని సమాధానం ఇవ్వడం విశేషం. తనకి అంజలి అంటే ఇష్టమని, అంజలికి కూడా నేనంటే ఇష్టమని తెలిపాడు.

తన కుటుంబసభ్యులకు కూడా అంజలి అంటే ఇస్తామని జై తెలిపాడు. తన తండ్రికి అంజలి అన్నా, ఆమె గుణమన్నా చాలా ఇష్టమని తెలిపాడు. తన ముగ్గురు అక్కలతో కూడా అంజలి చాలా స్నేహపూర్వకంగా ఉంటుందని తెలిపాడు. పెళ్లిగురించి ఇంకా ఆలోచించలేదని తెలిపాడు.