జై లవకుశ… డిస్టిబ్యూటర్స్ కి బొమ్మడిపోయింది! కాని ఫ్రేమ్ వేరుగా ఉంది!

Thursday, September 28th, 2017, 06:21:43 PM IST

ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా జై లవకుశ. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మూడు వేలకి పైగా స్క్రీన్స్ మీద రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన మొదటి మూడు రోజులు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. అంత వరకు భాగానే ఉంది. అసలు కథ అప్పుడే మొదలైంది. వీకెండ్ ముగిసిన తర్వాత సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నట విశ్వరూపం చూపించాడని అందరు మెచ్చుకున్నారు. కాని సినిమాలో కథ, కథనంలో ఉన్న మైనస్ వలన రెండో సారి ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురాలేకపోయింది. దీంతో కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయిపోయాయి.

నిజానికి జై లవకుశ సినిమా రిలీజ్ కి ముందే నిర్మాత కళ్యాణ్ రామ్ బిజినెస్ చేసేసాడు. అన్ని ఏరియాల రైట్స్ ని భారీ రెట్లు కి అమ్మేశాడు. ఇక దిల్ రాజు కూడా నైజాం, వైజాగ్ కలిపి 25 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరో వైపు సీడెడ్ లో 12.6 కోట్లు రైట్స్, ఖర్చులతో కలిపి మొత్తం 13 కోట్లు అయితే ఇప్పటికి 8 కోట్లు వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. జై లవకుశ 8.5 కోట్లకి ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నారు దీని ప్రకారం డిస్టిబ్యూటర్ సేఫ్ అవ్వాలంటే 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి. అయితే ఇప్పటి వరకు 9.57 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఇంకా సాగానికి పైగా కలెక్ట్ చేస్తే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వస్తారు. ఇక మిగిలిన ఏరియాల పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది.

అయితే చిత్ర యూనిట్ మాత్రం దసరా బరిలో సూపర్ హిట్ సినిమా అని ప్రకటనలు చేసుకుంటున్నారు. కాని వారం రోజుల్లో జై లవకుశ కలెక్ట్ చేసిన లెక్కలు చూసుకుంటే, డిస్టి బ్యూటర్స్ సేఫ్ జోన్ లోకి రావాలంటే ఇంకా 30 నుంచి 40 పెర్సెంట్ కలెక్ట్ చేయాలి. అయితే ఇప్పటికే సినిమాని థియేటర్స్ లో చాలా మంది చూసేసారు. మరి ఈ పరిస్థితిలో డిస్టి బ్యూటర్స్ కి ఈ 40 పెర్సెంట్ షేర్ వస్తుందా అనేది పెద్ద ప్రశ్నగానే ఉంది. పోనీ కలెక్ట్ చేస్తుంది అనుకున్న వీకెండ్ పూర్తయ్యే టైం కి మరో 10 పెర్సెంట్ మాత్రమె కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి .దానికి కారణం ఇప్పుడు జై లవకుశకి పోటీగా స్పైడర్ సినిమా ఒకటి ఉంది. దాంతో పాటు శుక్రవారం శర్వానంద్ మహానుభావుడు సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ నేపధ్యంలో సినిమా ఎంత వరకు డిస్టిబ్యూటర్స్ సొమ్ముని రికవరి చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఒక వేల ఎంత కలెక్ట్ చేసిన కనీసం 30 శాతం అయిన పెట్టిన పెట్టుబడి మీద నష్టం వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక వేళ అలా అయితే. జై లవకుశ హిట్ కాదు కదా, కనీసం ఎవరేజ్ అనడానికి కూడా అవకాశం లేదు. మరి డిస్టిబ్యూటర్స్ ని భారీ నష్టం తీసుకొస్తే భవిష్యత్తులో ఎన్టీఆర్ సినిమా అంటే కాస్తా భయపడే పరిస్థితి వస్తుందేమో.

  •  
  •  
  •  
  •  

Comments