జై లవకుశ సీడెడ్ లో టికెట్ వీక్! స్పైడర్ వస్తే పరిస్థితి ఏంటి?

Tuesday, September 26th, 2017, 12:09:42 PM IST


ఎన్టీఆర్ హీరోగా చేసిన జై లవకుశ సినిమా వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన సోమవారం అనూహ్యంగా కలెక్షన్స్ డ్రాప్ అయినట్లు తెలుస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ నటనతో పోజిటివ్ టాక్ తెచ్చుకున్న కథ, కథనంలో లోపాలు సినిమాకి పెద్ద ఇబ్బందిగా మారాయి. దాంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 3 వేలకి పైగా థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేసారు. దీంతో మొదటి మూడు రోజులు ఊహించని స్థాయిలో అనూహ్యంగా కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మెల్ల మెల్లగా కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా సీడెడ్ లో చూసుకుంటే అక్కడ రైట్స్ 12.6 కోట్లకి అమ్మినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కలెక్షన్స్ చూసుకుంటే 5 రోజుల్లో కలిపి 8 కోట్లు వరకు కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఉన్నపళంగా కలెక్షన్స్ డ్రాప్ అయిపోవడంతో పాటు. రేపటి నుంచి స్పైడర్ సినిమా జై లవకుశకి పోటీగా వస్తుంది.

ఈ నేపధ్యంలో జై లవకుశ మీద డిస్టిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే అయితే స్పైడర్ మీద ఎవరేజ్ టాక్ వస్తే అప్పుడు మరల జై లవకుశ కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉంది. ఒక వేళ స్పైడర్ హిట్ అయితే మాత్రం కలెక్షన్స్ మరింత డ్రాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అన్ని కోట్లు పెట్టుబడి పెట్టి కొన్న డిస్టిబ్యూటర్ కి కనీసం 2 కోట్లు పైనే నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దసరా వీకెండ్ ఏమైనా మరల పుంజుకుంటే పెట్టిన పెట్టుబడితో కాస్తా సేఫ్ జోన్ లోకి వస్తారు. మన హీరోలు ఎప్పుడు చెప్పే మాటల బట్టి అయితే నిర్మాతతో పాటు, సినిమాని కొన్న అందరికి డబ్బులు వస్తే సినిమా హిట్ క్రింద లెక్క, మరి ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ అయితే ముందే బిజినెస్ చేసి 30 కోట్లు వరకు వెనుక ఎసుకున్నాడు. మరి సినిమాని కొన్న వారి పరిస్థితి ఏంటి అనేదాని మీద జై లవకుశ సినిమా హిట్ రేంజ్ ఆధారపడి ఉంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments