జై లవకుశ 100 కోట్ల కలెక్షన్స్! ఇందులో వాస్తవం ఎంత?

Wednesday, September 27th, 2017, 05:50:40 PM IST


ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ అయిన వారం రోజులకే సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది అంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ జై లవకుశ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరినట్లు కొత్తగా పోస్టర్స్ రిలీజ్ చేసారు. అదే సమయంలో జై లవకుశ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా వచ్చినట్లు నిర్మాత కళ్యాణ్ రామ్ అఫీషియల్ గా ప్రకటన చేసాడు. అయితే జై లవకుశ కలెక్షన్స్ భాగానే ఉన్నాయని టాక్ ఉన్న వంద కోట్లు ఎంత వరకు నిజం అనేది ఇప్పుడు అందరికి వస్తున్నా డౌట్. వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తెచ్చుకున్న సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయినట్లు బయట నుంచి వస్తున్నా సమాచారం. అయితే జై లవకుశ సినిమా కేవలం 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు కలెక్షన్స్ ని క్రాస్ చేసింది అని చిత్ర యూనిట్ చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సినిమాని ముందే అమ్ముకొని నిర్మాత భారీగానే డబ్బు వెనకేసుకున్న బయ్యర్లకి మాత్రం జై లవకుశ వలన జెల్ల తగిలేలా ఉందని అందరు అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాతో వంద కోట్లు క్రాస్ చేసిన హీరోల జాబితాలో టాప్ లో తారక్ ఉండటం విశేషం. తమ అభిమాన హీరో ఈ క్లబ్ లో చేరడంపై ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి తిరుగు లేదని అంటూ కోలాహలంతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే తాజాగా వచ్చిన స్పైడర్ సినిమా సినిమాని తట్టుకొని జై లవకుశ ఎంత వరకు డిస్టిబ్యూటర్స్ ని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్తుంది అనేది త్వరలో తెలిసిపోతుంది.

Comments