ఈ వారం కింగ్ జై లవకుశ మాత్రమే! అది ఎన్టీఆర్ స్టామినా!

Monday, September 25th, 2017, 09:34:44 AM IST

జై లవకుశ రిలీజ్ అయ్యి నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇండియా, ఓవర్సీస్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపంకి జనం ఫిదా అయిపోయి చూస్తున్నారు. ఇది వరకు ఎన్టీఆర్ లో చూడని సరికొత్త నటన జై లవకుశ ద్వారా చూడటం వలన, ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరో వైపు సినిమాకి వెళ్తున్న ప్రేక్షకుడు కథ, కథనంతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ చేసిన జై లవ కుశ పాత్రలని ఫాలో అవ్వడం ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. సౌత్ ఇండియా లో కేవలం హీరో పెర్ఫార్మెన్స్ తో సినిమా చూసే స్థాయి రజినీకాంత్, పవన్ కళ్యాణ్ కి మాత్రమె మొన్నటి వరకు ఉందని అందరు భావించే వారు. అయితే ఎన్టీఆర్ లో కూడా ఆ సత్తా ఉందని జై లవకుశ సినిమాతో నిరూపించాడు. ప్రతి ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకి వస్తూ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడాలంటే జై లవకుశ చూడాల్సిందే అంటున్నారు. అంతలా తారక్ మూడు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులని కట్టిపడేసాడు.

ఎన్టీఆర్ నటనకి ఇండస్ట్రీ రికార్డ్స్ కూడా ఒక్కొక్కటి దాసోహం అయిపోతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో సినిమా 70 కోట్ల కలెక్షన్స్ ని చేరుకుంది . ఈ వారంలో జై లవకుశ సినిమా ద్వారా అత్యధిక కలెక్షన్స్ తెచ్చుకున్న జూనియర్ ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. జై లవకుశకి పోటీకి ఇక ఎ పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడం ఎన్టీఆర్ ప్రభంజనం అప్రతిహతంగా సాగిపోతుంది. ఈ వీకెండ్ లో ఈ సినిమా వంద కోట్లు మార్క్ చేరుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. స్పైడర్ సినిమా రిలీజ్ కావడానికి మరో రెండు రోజులు సమయం ఉంది ఈ లోపు జై లవకుశ 100 మార్క్ కి క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని బయట వినిపిస్తున్న టాక్. లాంగ్ రన్ లో మాత్రం ఎన్టీఆర్ కెరియర్ లో రికార్డు స్థాయిలో 150 కోట్లు వరకు జై లవకుశ కలెక్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ఈ లోపు స్పైడర్, మహానుభావుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న వేళ అవి ఎంత వరకు జై కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తాయి అనేది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments