తారక్ కుమ్మేశాడు.. సూపర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Saturday, September 23rd, 2017, 01:15:32 PM IST

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర మొదలు పెట్టాడు. జనతా గ్యారేజ్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తారక్ ఈ సారి అంతకు మించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యాలనే విధంగా దూసుకుపోతున్నాడు. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో బుధవారమే ప్రీమియర్ షోల ద్వారా హాఫ్ మిలియన్ ని క్రాస్ చేసిన ఈ సినిమా ఇక స్వదేశంలో దుమ్ము దులిపింది.

నైజాం లో ఎప్పుడు లేనంతగా మొదటి రోజు తారక్ రూ.5.05 కోట్లు రాబట్టాడు. ఇక సీడెడ్ లో కూడా మనోడు రూ.4.28 కోట్లు కొల్లగొట్టి బాహుబలి తర్వాత అంతటి వసూళ్లు సాధించిన హీరోగా గుర్తింపు పొందాడు. జనతా గ్యారేజ్ తో కర్ణాటకలో మంచి వసూళ్లను రాబట్టిన ఎన్టీఆర్ జై లవకుశ తో రూ.3.254 కోట్లను సంపాదించాడు. మొత్తంగా జైలవకుశ ఏపీ తెలంగాణలో 32 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందగా.. షేర్స్ రూపంలో రూ.21.86 కోట్లు వచ్చాయి. ఇక వరల్డ్ వీడే షేర్స్ అయితే 29.28 కోట్లు.ఈ హవా ఇలానే కొనసాగితే మొదటి వారంలోనే జై లవకుశ మంచి హిట్ గా నిలుస్తుంది అనడం ఖాయం

  •  
  •  
  •  
  •  

Comments