జై పాత్రతో .. ఎన్టీఆర్ ఫుల్ ఖుషి ?

Friday, September 29th, 2017, 11:01:36 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ ఇప్పటికే విడుదలై భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. అయితే జై పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నాడు ఎన్టీఆర్. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కలిసి పాల్గొన్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే పాత్ర జై అని, ఎప్పటినుండో మంచి పాత్రకోసం ఎదురు చేస్తున్న నాకు ఈ పాత్ర రావడం గొప్ప అవకాశం అని చెప్పాడు ఎన్టీఆర్ . ఇక కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలోని జై పాత్ర అద్భుతమని, ఈ సినిమాకు డబ్బులు వచ్చాయా లేదా అన్నది పక్కన పెడితే తారక్ కెరీర్ లో నిలిచిపోయే పాత్ర ఇది చెబుతున్నాడు. ఈ కథకు తారక్ తప్ప మరెవరు న్యాయం చెయ్యలేరని అన్నాడు కళ్యాణ్ రామ్. మొత్తానికి ఎన్టీఆర్ జై లవకుశ విషయంలో ఫుల్ ఖుషి మీదున్నాడు మరి.

  •  
  •  
  •  
  •  

Comments