రివ్యూ రాజా తీన్‌మార్ : జై సింహ – రొటీన్ సింహం

Friday, January 12th, 2018, 05:00:22 PM IST

తెరపై కనిపించిన వారు : బాలక్రిష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి

కెప్టెన్ ఆఫ్ ‘జై సింహ’ : కె.ఎస్. రవికుమార్

మూల కథ :

నరసింహ (బాలక్రిష్ణ) అప్పుడే పుట్టిన తన కొడుకుతో వైజాగ్ వదిలేసి అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు తిరుగుతూ చివరికి కుంభకోణంకు చేరుకుంటాడు. అలా అక్కడే డ్రైవర్ గా పని చేసుకుంటున్న అతనికి ఒక ఇన్సిడెంట్ ద్వారా గతంలో తాను ప్రేమించిన అమ్మాయి గౌరి (నయనతార) ఎదురవుతుంది.

కానీ అప్పటికే ఆమె అతనిపై ద్వేషం పెంచుకుని, అసహ్యించుకునే స్థాయిలో ఉంటుంది. అసలు నరసింహ కొడుకుతో సహా వైజాగ్ వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు ? ప్రాణంగా ప్రేమించిన గౌరి అతన్ని ఎందుకు శత్రువులా చూస్తుంది ? అతని గతమేమిటి ? అనేదే సినిమా.

విజిల్ పోడు :

–> సినిమాలో బాలయ్య నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే గొప్ప స్థాయిలో ఉంది. ముందుగా ఆయన నటనకు మొదటి విజిల్ వేయాలి.

–> ఫస్టాఫ్ మధ్యలో వచ్చే పూజారుల గొప్పదనాన్ని వివరించి సన్నివేశం, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగ్ కుదిరాయి.

–> క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎంతో భావోద్వేగంగా సాగుతూ హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. అదే సినిమా మొత్తానికి హైలెట్ సీన్ అని కూడా చెప్పొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఏ.ఎం. రత్నం రాసిన కథ పూర్తిగా పాతది. అందులో కొత్తదనం ఏమీ లేదు. పైగా బాలయ్య గత సినిమాలను కలగలిపి రాసినట్టు ఉంటుంది.

–> దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కథనం కూడా చాలా నెమ్మదిగా, పాత తరహాలోనే సాగింది. దీంతో సినిమాలో ఎక్కడా ఎగ్జైట్మెంట్ అనేదే దొరకలేదు.

–> అలాగే బ్రహ్మనందం కామెడీ, హీరో స్నేహితుల మీద కొన్ని సన్నివేశాలు మరీ బోర్ కొట్టించాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> ఈ సినిమాలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన సంనివేశాలు, అంశాలు లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : బాలకృష్ణ నటన మాత్రం హైలెట్.
మిస్టర్ బి : దానితో పాటే సినిమా కొంచెం కొత్తగా ఉంటే బాగుండేది.
మిస్టర్ ఏ : అవును. బాలయ్య ఇరగదీసినా, సినిమా రొటీన్ అయిపోయింది.