ఆయన కెసిఆర్ ని కడిగేసి, ఉతికేస్తున్నారట!

Friday, September 12th, 2014, 05:40:45 PM IST


కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి శుక్రవారం గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధ్యం కాని వాగ్ధానాలు ఇవ్వడం వల్లనే ఎన్నికలలో తెరాస పార్టీ గెలిచిందని విమర్శించారు. అలాగే తెలంగాణను తెచ్చినందుకు ప్రజలు తెరాసకు ఓట్లు వెయ్యలేదని, సోనియా గాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చెయ్యలేదని కెసిఆర్ స్వయంగా మెదక్ జిల్లా నర్సాపూర్ సభలో ఒప్పుకున్నారని పేర్కొన్నారు. అలాగే సర్కారు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇప్పటికే తెలంగాణ పిసిసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఉతికేస్తూ, కడిగేస్తున్నారని జైపాల్ రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రస్ పార్టీ ఎన్నడూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా లేదని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.