ఇలా మాట్లాడితే కష్టమే దొరగారు

Friday, September 12th, 2014, 05:51:54 PM IST

kcr-and-jaipal
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడే తీరును మార్చుకోవాలని లేకపోలే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తగ్గిపోతుందని కాంగ్రెస్ మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తెరాస పార్టీ తెలంగాణ తెచ్చిన ఘనత వలన రాలేదని.. నెరవేర్చలేని హామీలు ఇవ్వడం వలనే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. మీడియా గురించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని.. లేకుంటే.. హైదరాబాద్ ఇమేజ్ తగ్గిపోతుందన్నారు. హైదరాబాద్ ఇమేజ్ తగ్గితే.. పెట్టుబడులు రావడం కష్టమని.. కాబటి మాట్లాడేటప్పుడు.. జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన కెసిఆర్ కు హితవు పలికారు. తెలంగాణపై ప్రతిఒక్కరికి అభిమానం ఉన్నదని..ఆయన అన్నారు. తెలంగాణ రావడంలో మీడియా పాత్రకీలకమైనదని గుర్తుంచుకోవాలని అన్నారు.