ఓటమికి నిరుత్సాహపడొద్దు!

Monday, September 15th, 2014, 04:36:28 PM IST


కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లో జరిగిన టిపిసిసీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పట్ల ఎవరూ నిరుత్సాహపడవద్దని, భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిదని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ హైదరాబాద్ లో అన్ని వర్గాల ప్రజల బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే మానవతావాదాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జైపాల్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ తెలంగాణకు ప్రధానమని, ఎప్పటి నుండో తెలుగేతరులు ఈ నగరానికి వస్తున్నారని, భవిష్యత్తులో కూడా వస్తారని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.