50 కోట్లు ఎక్క‌డ‌? `జై సింహా` అస‌లు లెక్క ఇదీ!?

Tuesday, January 23rd, 2018, 03:35:58 PM IST

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `జై సింహా` సంక్రాంతి బ‌రిలో రిలీజై ఇత‌ర చిత్రాల‌తో పోలిస్తే బెట‌ర్ అనిపించిన సంగ‌తి వాస్త‌వం. తాజాగా ఈ సినిమా 50 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది అంటూ చిత్ర‌యూనిట్ బోలెడంత సంద‌డి చేసేసింది. ఈ సంద‌డి చూస్తే.. అవునా.. నిజంగానే 50 కోట్ల షేర్ వ‌సూలు చేసిందా? అంటూ అంతా ఒక‌టే విస్మ‌యానికి గుర‌య్యారు. వాస్త‌వానికి ట్రేడ్ రిపోర్ట్ ఒక‌లా ఉంటే, ప్ర‌చారం వేరొక‌లా ఉందే అంటూ కొంద‌రు చెణుకులు వేశారు. అయితే ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లో ఒకానొక అబౌ యావ‌రేజ్ సినిమా అని ట్రేడ్ నిపుణులు కొంద‌రు తేల్చేస్తున్నారు.

అస‌లు వాస్త‌వంగా ఈ సినిమాకి వ‌చ్చిన వ‌సూళ్లు ప‌రిశీలిస్తే ఆ మాట మీరే చెబుతారు. ట్రేడ్ రిపోర్ట్ ప్ర‌కారం.. జైసింహా మొద‌టి 10 రోజుల్లో 25 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. గ్రాస్ మ‌రో 15 కోట్లు అద‌నంగా క‌లిపినా 40 కోట్ల వ‌రకూ వ‌సూళ్లు సాధించి ఉండొచ్చ‌న్న అంచ‌నా వేస్తున్నారు. అంటే ఇది ఎబౌ యావ‌రేజ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక బాల‌య్య సినిమాల్లో ది బెస్ట్ సినిమాల జాబితా ప‌రిశీలిస్తే .. గ‌త ఏడాది రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ది బెస్ట్‌. ఆ త‌ర్వాత సింహా, లెజెండ్ ఆ జాబితాలో చేరాయి. ఇవ‌న్నీ 25 కోట్ల షేర్ వ‌సూలు చేసిన‌వే. జైసింహా 10రోజుల క‌లెక్ష‌న్స్ వివ‌రాలిలా ఉన్నాయి. నైజాం – 4.1 కోట్లు, సీడెడ్‌- 5.3 కోట్లు, ఉత్త‌రాంధ్ర – 3.44 కోట్లు, తూ.గో జిల్లా- 2.44 కోట్లు, ప‌.గో జిల్లా- 2.04 కోట్లు, కృష్ణ‌- 1.61 కోట్లు, గుంటూరు- 2.37 కోట్లు, నెల్లూరు – 1.23 కోట్లు, ఏపీ, నైజాం క‌లుపుకుని – 22.43 కోట్లు వ‌సూలైంది. ఇత‌ర‌చోట్ల మ‌రో 2కోట్లు యాడైంది. ఓవ‌ర్సీస్ – 80ల‌క్ష‌లు వ‌సూలైంది.. మొత్తంగా 25.33 కోట్ల వ‌సూళ్లు ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది.