ఇండస్ట్రీ గురించి జైసింహా ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్ !

Friday, January 5th, 2018, 02:38:18 PM IST

టాలీవుడ్ కాంట్రవర్షియల్ ప్రొడ్యూసర్స్ లో సి కళ్యాణ్ కూడా ఒకరు. సి కళ్యాణ్ కు అటు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో, ఇటు రాజకీయ నాయకులతో సైతం వివాదాలు ఉన్నాయి. సి కళ్యాణ్ తాజాగా బాలయ్య జై సింహా చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12 న విడుదల కాబోతోంది. మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీసేలా ఉన్నాయి.

నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ ల గురించి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నైజాంలో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్ లు తయారయ్యారు. ఆ ఏరియాలో కొంటె వాళ్లే కొనాలి లేకుంటే మరెవరినీ కొననివ్వరు. ఇదే పరిస్థితి కొనసాగితే చిన్న నిర్మాతలు సినిమాలు కొనలేని పరిస్థితి తలెత్తుతుంది. మార్చి1 నుంచి ఇండస్ట్రీని షట్ డౌన్ చేస్తున్నామంటూ కళ్యాణ్ అన్నారు. జీఎస్టీ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్పొరేట్ సంస్థలు నిర్మించే సినిమాలకైతే జీఎస్టీ సరిపోతుంది. కానీ మా లాంటి చిన్న నిర్మాతలు జిఎస్టీని తట్టుకోవడం కష్టం అని అన్నారు. జిఎస్ అమలయ్యాక సినిమాలపై టాక్సుల బాదుడు ఎక్కువైన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే తమిళనాడులో ఉద్యమం జరుగుతుండగా, టాలీవుడ్ లో సైతం జీఎస్టీ ఎఫెక్ట్ క్రమంగా కనిపిస్తోంది.