బిగ్ న్యూస్ : నేను కొడితే మళ్ళీ లెగలేవు..ఎమ్మెల్యేకు జలీల్ వార్నింగ్!

Friday, January 24th, 2020, 07:00:27 AM IST

ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో నెలకొన్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాము.దీనితో టీడీపీ మరియు వైసీపీ పార్టీ నేతల మధ్య పెద్ద ఎత్తున రచ్చ లేస్తుంది.ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ పై మాజీ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొన్ని సంచలన రేపే కామెంట్స్ చేసారు.

వెల్లంపల్లి శ్రీనివాస్ నేను ముష్టి వేస్తే గెలిచిన ఎమ్మెల్యే అని నా వయసు 68 సంవత్సరాలని 27 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న నేను ఎంతో మందిని చూసానని వాడికి తెలీదేమో దేవాదాయ శాఖలో చేసిన మంత్రికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని అంటూ రెచ్చిపోయారు.

అంతే కాకుండా నువ్వు కుర్రాడివి నా కంటే చిన్నోడివి నువ్వే చెప్పు ఎక్కడికైనా వస్తా ఇద్దరం సింగిల్ గా కొట్టుకుందాం రా..అంటూ ఛాలెంజ్ చేస్తూ నేను కొడితే మళ్ళీ లెగలేవు నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా నువ్ లేగలేవు అంటూ బాలయ్య రేంజ్ లో డైలాగ్ చెప్తూ నీ స్థాయిని మించిన మాట్లాడకు అంటూ హెచ్చరించారు.