అవతార్ దర్శకుడిని నుంచి ఊహించని అద్భుతం!

Tuesday, July 24th, 2018, 05:38:36 PM IST

హాలీవుడ్ లో తెరకెక్క గ్రాఫిక్స్ సినిమాలకు ఉండే ఆదరణే వేరు. ఎలాంటి కథలనైనా సరే అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తారు. టైటానిక్ – అవతార్ వంటి సినిమాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాగే ఆ సినిమాలకు దర్శకత్వం వహించిన జేమ్స్ కేమెరూన్ ని ఎంత పొగిడినా కూడా తక్కువే. ఇకపోతే అతను స్క్రీన్ ప్లే కు సహకరించి నిర్మాతగా అందిస్తున్న మరో వండర్ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకులను అలరించనుంది.

‘అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్’ అనే సినిమాకు రాబర్ట్ రోడ్రిగే దర్శకత్వం వహించారు. ఒక అమ్మాయి ఆకారంలో ఉన్న రోబో కొన్నేళ్ల తరువాత ప్రాణంతో ప్రజల్లోకి వస్తుంది. ఒక వ్యక్తి తనకి గతం గుర్తు చేయించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఊహించని శక్తులు ఆమె పై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు తన పవర్స్ అలాగే గతం గురించి గుర్తుకు వస్తుంది. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది సినిమా కథాంశం. ఇటీవల సినిమాకు సంబందించి రెండవ ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను రేపారు.

  •  
  •  
  •  
  •  

Comments