ముఖ్యమంత్రికి జొన్న అన్నం పెడతానన్న జానారెడ్డి

Wednesday, December 28th, 2016, 02:54:57 PM IST

Jana-reddy
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మాట్లాడుతూ… తాను ప్రతిపక్ష నేత అయిన జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్తానని అన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుల ఇంటికెళ్లి ముఖ్యమంత్రి భోజనం చేసే సంప్రదాయం ఉండేదని అని కేసీఆర్ చెప్పారు. అందుకే తాను కూడా జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లాలనుకుంటున్నానని, ఆయన పప్పు వేసి పెట్టినా, పులుసు వేసి పెట్టినా తిని వస్తానని కేసీఆర్ అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరబూశాయి.

జానారెడ్డి ఈ విషయంపై బుధవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి తన ఇంటికి భోజనానికి వస్తానన్నారని అయితే ఎప్పుడు వచ్చేది ఇంకా చెప్పలేదని జానారెడ్డి చమత్కరించారు. కేసీఆర్ తన ఇంటికి వస్తే జొన్న అన్నం పెడతానని ఆయన అన్నారు. ఇంకా తనపై వస్తున్న విమర్శల గురించి జానారెడ్డి మాట్లాడుతూ.. తన పనితీరు బాగోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ అనలేదని అన్నారు. ఎవరికైనా సీఎల్పి నాయకుడి పదవిపై ఆసక్తి ఉంటే చెప్పాలని తన ఎమ్మెల్యేలకు సూచించానని జానారెడ్డి అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments