హాట్ టాపిక్: ఈ విషయంలోజనసేన ప్రయత్నం ఫలిస్తుందా?

Saturday, November 9th, 2019, 12:59:04 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరత విషయం లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. విశాఖలో చేపట్టిన లాంగ్ మార్చ్ ని మరవక ముందే కార్మికులకు ఆహారాన్ని అందించే ప్రక్రియ లో వుంది. దీనికి సంబందించిన పోస్ట్ ని జనసేన పార్టీ ఆఫీషియల్ గా తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15, 16 తేదీలలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. భవన నిర్మాణ కార్మికులు కలిసే చోట అడ్డా వద్ద ఈ ఆహార శిబిరాలను జనసేన ఏర్పాటు చేయనుంది.

ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇసుక కొరతతో ఎంతో మంది ప్రజలు ఆహారానికి కూడ డబ్బులు లేక పోవడం తో కొద్దిపాటి ఊరట ఇచ్చేందుకు పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు మేమున్నామన్న భరోసాని ఇస్తూ, ప్రభుత్వం కళ్ళు తెరిపించడమే తమ ఉద్దేశం అని తెలిపింది. మరి ఈ విషయం లో జనసేన ప్రయత్నం ఫలిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.