జనసేన పార్టీ లాంగ్ మార్చ్ కి ముందు, తరువాత జరిగిన పరిణామాలు ఇవే!

Tuesday, November 19th, 2019, 07:22:32 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరత వలన ఉపాధి కోల్పోయిన కార్మికుల కోసం తన వంతు సాయంగా చాలానే చేసాడు. విశాఖపట్టణం లో లాంగ్ మార్చ్ నిర్వహించిన తరువాత చాల మార్పులే సంభవించాయి. అయితే లాంగ్ మార్చ్ కి ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరత కు గల కారణాల్ని తెలుసుకున్నారు. కృత్రిమ ఇసుక కొరత అని నిర్దారించిన తరువాత ఈ సమస్య పై పోరాటం చేయాలనీ దృఢంగా సంకల్పించారు. ఇసుక కొరత వలన కేవలం కార్మికులు మాత్రమే కాదు, ప్రజలు, భవన నిర్మాణ సంబంధిత వ్యాపారాలు ఇంకా చాల మంది భారీ స్థాయిలో నష్టపోయారు.

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్ వైసీపీ ప్రభుత్వం లో కదలికని తీసుకువచ్చింది. వైసీపీ ప్రభుత్వం దీనికి పలు సమీక్షలు నిర్వహించి, ఇసుక వారోత్సవాలు చేయడమే కాకుండా, ఇసుక లభ్యతని పెంచుతూ,దానికి కొన్ని నియమ నిబంధలను పెట్టింది. అయితే జనసేన పార్టీ కార్మికుల కోసం రెండు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, పని లేకుండా వున్న ఆరు నెలలకు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఈ విషయాలని వైసీపీ ప్రభుత్వం పరిగణన లోకి తీసుకొని, నష్టపోయిన కార్మికులకు న్యాయం చేస్తుందో లేదో చూడాలి.