తక్షణమే ఏర్పాటు చేయాలి

Saturday, September 6th, 2014, 05:13:39 PM IST


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను తక్షణమే ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు వచ్చేనెలలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నదనే వార్తలు వస్తుండటంతో జానారెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు జానారెడ్డి గవర్నర్ నరసింహన్ కు, ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖ వ్రాశారు. అసెంబ్లీ సమావేశాలు వెంటనే ఏర్పాటు చేసి.. పీజ్ రీయింబర్స్ మెంట్, సంక్షేక పధకాలు తదితర విషయాలపై చర్చించాలని జానారెడ్డి గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.