పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం ఖాయం – ఇదిగో సాక్ష్యం…

Wednesday, October 16th, 2019, 03:00:13 AM IST

సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకొని, ఆ తరువాత ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి, సొంతంగా ఒక పార్టీ పెట్టి ప్రస్తుతానికి రాజకీయాల్లో బిజీగా కొనసాగుతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ప్రస్తుతానికి తన పార్టీని ప్రజల్లో బలంగా నింపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జనసేన పార్టీ ని స్థాపించాడో అప్పటుకినుండే పవన్ ని అణగదొక్కడానికి చాలా ప్రయత్నిస్తున్నారు మిగతా పార్టీల నేతలు. ఒకరకంగా చెప్పాలంటే మాత్రం ఒక్క జనసేన పార్టీకి ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా భయపడుతున్నాయి.

అయితే అప్పటివరకు పవన్ ని పొగడ్తలతో ముంచెత్తిన వారందరుకూడా జనసేన పార్టీ స్థాపించడంతో కట్టగట్టుకొని మరీ వంతులవారీగా పవన్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ రాజకీయాల్లో ఓడిపోవడంతో, పవన్ ది అంత చాతకాని తనం అని అందరు కూడా డిబేట్లు పెట్టి మరీ మీడియా చానళ్ళు చాలా వరకు ప్రచారాలు చేశాయి. అయితే ఎన్నకలకు ముందు ఇలా చేశారంటే ఒక అర్థముంది. కానీ ఇప్పటికి ఇలా పవన్ పై కక్షగట్టీ మరి ఇలా చేయడం ఏంటి అనేది ఎవరికీ అర్థమవట్లేదని చెప్పాలి. ఇకపోతే ఎన్నికల తరువాత తన పార్టీని ఎవరితో కలపను అని, ఏ పార్టీలో విలీనం చేయనని, ఇకమీదట సినిమాలు కూడా చేయనని పవన్ ఇప్పటికే చాల సార్లు బహిరంగంగానే ప్రకటించారు. కానీ జనసేనాని కేంద్రంతో విలీనం చేస్తున్నారని, పార్టీ ని పక్కనబెట్టి మళ్ళీ సినిమాలు చేస్తున్నారు అని విపక్షాలు పుకార్లు సృష్టిస్తున్నాయి.

కానీ ఇకపోతే దర్శకుడు క్రిష్ పవన్ కోసం ఒక కథ సిద్ధం చేశారని పుకార్లు రేకెత్తించారు. కానీ అసలు పవన్ ఇంతవరకు క్రిష్ తో ఎలాంటి చర్చలు జరపలేదని, కానీ అనవసరంగా పుకార్లు సృష్టించే వారికీ ఇదే పని అని అందరు కూడా ఆడిపోసుకుంటున్నారు. అంటే ప్రత్యక్షంగా పవన్ కి రాజకీయాల్లో అంత సీన్ లేదని చెబుతున్నావారే ఇలా పవన్ ని ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారో వారికే తెలియాలి మరి. ఒక వేళా ఇది ఇలాగె కొనసాగితే పవన్ తప్పకుండ సీఎం అవడం ఖాయమని పలువురు రాజకీయ్యా విశ్లేషకులు చెబుతున్నారు.