జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రలో తీవ్ర చర్చనీయాశంగా మారిపోయింది. మలికిపురం పోలీస్ స్టేషన్ లోకి రాపాక తన అనుచరులను తీసుకోని వెళ్లి గోల చేశాడని ఆ సమయంలో ఎసైకి రాపాక కి మధ్య వాదన జరిగి, ఎసై రాపాక వర ప్రసాద్ నీ కాల్చేస్తా అని బెదించటంతో ఎమ్మెల్యే అనుచరులు స్టేషన్ పై రాళ్లు రువ్వారని దీనితో రాపాకనీ ఆయన అనుచరులపై కేసులు నమోదు అయ్యాయి.
తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజల తరఫున పోలీస్ స్టేషన్కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సమంజసం కాదని, ప్రజల కోసం కష్టపడే వ్యక్తి రాపాక, ప్రజలు అడిగితే వాళ్ళకి మద్దతుగా స్టేషన్ కి వెళ్లిన ఎమ్మెల్యే కేసు పెట్టటం ఏంటి.. కావాలనే మలికిపురం విషయాన్నీ పెద్దదిగా చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే సీనియర్ జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ, ప్రజల పక్షాన వెళ్లినందుకు రాపాక మీద కేసు పెడుతారా..?
ఈ విషయంలో నాయకులూ, కార్యకర్తలు సమన్వయం పాటించాలి పరిస్థితి అదుపుతప్పి.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన పక్షంలో తానే స్వయంగా వస్తానన్నారు. మలికిపురం ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్య నేతలతో సమీక్షిస్తున్న ఎలాంటి తప్పు జరిగిన సహించేది లేదంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది.