కూతురి పుట్టినరోజు వేడుకల్లో పవన్..

Friday, March 23rd, 2018, 12:09:18 PM IST

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సతీమణి రేణూ దేశాయ్‌ల దాంపత్యంలో వారికి ఇద్దరు పిల్లలు జన్మించగా ఆ పిల్లలిద్దరికి అకీరా, ఆద్య అనే పేర్లు పెట్టిన సంగ‌తి తెలిసిందే . ప్రసుతం పవన్.. రేణూకు దూరంగా ఉంటున్న కూడా వారి క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు అనే సమాచారం ఉంది. మార్చి 23న ఆద్యా బ‌ర్త్ డే కావ‌డంతో గ‌త ఏడాది ఇదే రోజున పూణేకి వెళ్ళాడు ప‌వ‌న్ . ఆద్యా ఏడో బ‌ర్త్‌డే వేడుక‌ల‌లో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఆద్యా తో పాటు ఈ చిన్నారి ఫ్రెండ్స్ తోను పవన్ సరదాగా గడిపాడు. ఆద్యాతో పవన్ కేక్ కట్ చేయిస్తున్న ఫోటోస్ అప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి . అయితే పొలిటిక‌ల్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ ఈ సారి మాత్రం ఆద్యా ఎనిమిదో బ‌ర్త్‌డే వేడుక‌కి హాజ‌రు కానట్టు తెలుస్తుంది. ప‌వ‌న్ అభిమానులు మాత్రం పాత ఫోటోస్‌నే సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఆద్యాకి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఆ చిన్నారి భ‌విష్య‌త్‌లో మ‌రింత ఎత్తుకు ఎద‌గాల‌ని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ చిన్నారి మాత్రం త‌న బ‌ర్త్‌డే రోజున తండ్రిని మిస్ కావ‌డం బాధాకరం అంటున్నారు.