వైసీపీ ఆరోపణలు చేస్తే జనసేన పని చేసి చూపింది.?

Thursday, October 10th, 2019, 07:12:42 AM IST

ఏపీలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం పై హైడ్రామా ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే ఉంది.గత ప్రభుత్వంలో భారీ అవినీతి చేసారని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఆరోపణలు చేస్తుంది.ఇదిగో వీరి అవినీతి బయట పెడుతున్నాం అని అంటున్నారు తప్ప ఈ విషయంలో వైసీపీ చూపిస్తున్న పురోగతి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కూడా అవినీతి చేసేందుకే రివర్స్ టెండర్లు వేస్తున్నారు కానీ మేము ఎలాంటి అవినీతి చెయ్యలేదని తెలుగు తమ్ముళ్లు కూడా ఎక్కడా చెప్తున్నా దాఖలాలు లేవు.

దీనితో ఈ రెండు పార్టీల రాజకీయాలు చూసి వేసారిపోయిన జనసేన వీరికి అతీతంగా చేసిన పని ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది.గతంలో టీడీపీ పోలవరం విషయంలో భారీ అవినీతి చేసిందని జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి పెంటపాటి పుల్లారావు వేసిన పిటిషన్ ను ఢిల్లీ హై కోర్ట్ ఇప్పుడు బయటకు తీసిందని,ఆ కేసుపై ఇప్పుడు అన్ని నిజాలు ఎవరెవరు ఎంత నొక్కారో నిగ్గు తెలుతుందని,వైసీపీ వారు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తే జనసేన పని చేస్తుందని జనసేన శ్రేణులు అంటున్నారు.