పార్టీలో ఉంటావా..? వెళ్ళిపోతావా..? అయోమయంలో రాపాక

Friday, June 14th, 2019, 12:36:05 PM IST

జనసేన 130 కి పైగా స్థానాల్లో పోటీచేస్తే ఒకే ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది. స్వయానా పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు చోట్ల కూడా ఓడిపోవటం జరిగింది. ఇక రాజోలులో గెలిచిన రాపాక వరప్రసాద్ మొదట్లో పార్టీ మారిపోతాడు అనే మాటలు వినిపించాయి, కానీ నేను పార్టీ మారే అవకాశం లేదు. ఇప్పుడు నేను వైస్సార్సీపీ లోకి వెళ్ళిపోతే 152 అవుతాను, అదే జనసేనలో ఉంటే నెంబర్ వన్ గా ఉంటానని చెప్పుకొచ్చాడు.

కాకపోతే ఇప్పుడు జరుగుతున్నా పరిణామాలు వలన అయన కొంచం ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. అదేమిటంటే అసెంబ్లీ సమావేశాలు సమయంలో రాపాక వెళ్లి సీఎం జగన్ ని కలిసి మాట్లాడతాడు. దీనిపై జనసేన కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మీరు జనసేన MLA గా ఉండి. జగన్ ని ఎలా కలుస్తారు.. మీ వల్ల పార్టీ మీద నమ్మకం పోతుంది. మీరు పార్టీలో ఉంటే ఉండండి..? లేకపోతే వెళ్లిపోండి.? మాకు మా పవన్ కళ్యాణ్ ఒక్కడే చాలు అంటూ అర్ధం పర్థం లేని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మొదటి అసెంబ్లీ సమయంలో సీఎం కనిపించినప్పుడు ప్రతి MLA కూడా పార్టీలు అనే తేడా లేకుండా వెళ్లి మర్యదపూర్వకంగా కలవటం జరుగుతుంది. అలాగే రాపాక కూడా కలిశాడు. అందులో ఎలాంటి తప్పు అనేది లేదు.

కాకపోతే సరైన అవగాహన లేని జనసైనికులు నోటికి ఏమొస్తుందో తెలియక, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ తరుపున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీకి గౌరవం తీసుకోనివస్తున్నా, రాపాకాని గౌరవించటం మర్చిపోయి, ఇలా చిన్నదానికి కూడా విమర్శలు చేయటం మంచిది కాదు. ఇప్పటికే ఒకసారి జనసైనికుల వలన ‘రాపాక’ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మరోసారి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిపై పవన్ కళ్యాణ్ మౌనం విడిచిపెట్టి జన సైనికులకు సృష్టమైన ఆదేశాలు ఇస్తే మంచిది. లేకపోతే ఉన్న ఒకే ఒక్కడు కూడా వెళ్లిపోయే అవకాశం ఉంది..