బ్రేకింగ్ న్యూస్ : జనసేనానికి మరో దెబ్బ..పార్టీ కీలక అభ్యర్థి రాజీనామా.!

Saturday, June 8th, 2019, 02:21:25 PM IST

గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘోరమైన పరాజయం చవిచూసిన సంగతి అందరికి తెలిసిందే.ఎవరు ఎన్ని అనుకున్నా సరే పవన్ మాత్రం చాలా గట్టి కమిట్మెంట్ తోనే రాజకీయాల్లోకి దిగానని చెప్తుంటారు.అందుకు తగ్గట్టుగానే తాజాగా పార్టీ ఓడినా సరే మళ్ళీ ప్రజల్లోనే తిరిగేందుకు సిద్ధ పడ్డారు.ఎన్నికల్లో పోటీ చేసింది మొట్టమొదటి సారే అందులోను అనుకున్న స్థాయి ప్రభావాన్ని చూపకపోయే సరికి ఇప్పుడు ఆ పార్టీలోకి చేరిన వారిలో కొంత మంది అసలు రంగులు బయటపెడుతున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేసేసి జనసేన పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో అతనికి పవన్ ఇమేజ్ తోడయ్యి ఎమ్మెల్యే గా ఖచ్చితంగా గెలుస్తారు అని అంతా భావించారు.కానీ ఫలితాలు పూర్తి విరుద్ధంగా రావడంతో రాబోయే ఐదేళ్లు పవన్ తో కలిసి నడవడం కష్టమని అనుకున్నారో ఏమో ఇప్పుడు రాజీనామా చేసి ఒక్కక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు.తాను రాజీనామా చేస్తున్నట్టుగా రావెల కిషోర్ బాబు ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేసారు.మరి రాబోయే ఐదేళ్లలో పవన్ తో ఇంకెంత మంది కలిసి వెళ్తారో చూడాలి.