పవన్ కళ్యాణ్ ప్రభంజనం రాజకీయాల్లో పని చేయడం లేదా?

Thursday, October 17th, 2019, 03:53:26 PM IST

తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే పవన్ కళ్యాణ్ కి ఒక్కరే వచ్చే ఎన్నికల వరకూ పోరాడటం కష్టం అనిపిస్తుంది. తాజాగా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జనసేన పార్టీ నుండి వైసీపీ లోకి చేరారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా ఖాళీ అవుతున్న జనసేన బలం, బలగం తగ్గుతూ వుంది. పవన్ కళ్యాణ్ మాత్రం కొత్త నాయకులేమో గాని, ఉన్న క్యాడర్ ని కాపాడుకుంటే మంచిది అని అనిపిస్తుంది. తన సిద్ధాంతాలు నచ్చకనో, విధానాలు నచ్చకనో జనసేన నేతలు ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు.

2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ కూటమిగా పోరాడినపుడు జనసేన బలం ఏంటో అందరికి తెలుసు పవన్ విధానాలే పార్టీ కి అతి పెద్ద దెబ్బ అని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. రానున్న ఎన్నికలకు పార్టీ ని బలోపేతం చేయడానికి తగు ప్రణాళికని రచించి ముందుకు సాగేలా, వలసలు లేకుండా జాగ్రత్త పడేలా పవన్ నిర్ణయాలు ఉంటే కనీసం ప్రతిపక్షం అయినా దక్కుతుంది. అంతే కాకుండా పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే పవన్ రాజకీయం గందరగోళంగా మారే అవకాశం వుంది.