30 ఏళ్ళకి మొదటి దెబ్బ పడింది—నాగబాబు

Tuesday, January 14th, 2020, 11:00:49 PM IST

రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు ఆందోళన చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. రైతుల్ని అవమానపరిచేలా వైసీపీ నేత, పృథ్విరాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఒక మహిళతో రాసలీలలు నడిపాడన్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం తో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఈ విషయం పట్ల మరియు రైతులను ఇబ్బంది పెడుతున్న వైసీపీ నేతలు అంటూ నాగబాబు వైసీపీ ప్రభుత్వం ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

రైతుల అంటే వైసీపీ వాళ్ళకి లోకువ అని జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. వాళ్ళని, వాళ్ళ మనోభావాల్ని అవమానించిన వాళ్ళకి ఉసురు తగలడం మొదలైంది అని అన్నారు. 30 ఏళ్ళకి మొదటి దెబ్బపడింది అని అన్నారు. వరుస మొదలైంది అని అన్నారు. రాజధాని రైతు సోదరులారా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ లెక్కలు తేలుతున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేసారు.