ప్లాష్ ప్లాష్ : సీఎం జగన్‌ని కలిసిన జనసేన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా..!

Wednesday, June 12th, 2019, 05:02:20 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే నేడు అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేసారు.

అయితే అసెంబ్లీ సమావేశాలలో ముందుగా సీఎం జగన్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు. వీరిద్దరు ముగిసిన తరువాత మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జనసేన నుంచి మాత్రం ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు సీఎం జగన్ ఛాంబర్‌కు వెళ్లి జగన్‌ని కలిసారు. అయితే సీఎంను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం జగన్‌ను తాను మర్యాదపూర్వకంగానే కలిసానని ఇందులో వేరే ఆలోచమ్నలు ఏమీ లేవని చెప్పారు. అయితే జనసేనలో ఒకే ఒక్క ఎమ్మెల్యే అయినందున పార్టీ మారి వైసీపీలో చేరుతున్నానంటూ మీడియాలో వార్తలు బాగా ప్రచారం చేస్తున్నారని, తాను జనసేన నుంచి గెలిచాను, చచ్చే వరకు జనసేనలోనే ఉంటానని పార్టీ మారే ఆలోచనలే లేవని స్పష్టం చేశారు.