ఏపీ సీఎం పై జనసేన ఒక్క ఎమ్మెల్యే సంచలనం.!

Friday, June 14th, 2019, 08:48:57 PM IST

తాజాగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ ఇప్పుడు చాలా దూకుడుగా రాష్ట్రంలోని అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇలా జగన్ శర వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతుండగా కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొంత మంది విమర్శలు చేస్తున్నారు.అయితే ఇవన్నీ సర్వ సాధారణం కానీ జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రాజకీయ వర్గాల్లో రాపాక వర ప్రసాద్ హాట్ టాపిక్ గా నిలిచారు.అదొక్కటే కాకుండా అసెంబ్లీలో కూడా తనదైన చతురత చూపి ప్రశంసలు అందుకున్నారు.అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.

జగన్ తమకేదో మంచి చేస్తారని రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలు అంతా ముఖ్యమంత్రిని చేశారని వారి అందరి నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకొవాలని తెలియజేసారు.జగన్ కేవలం 46 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తనలో ఉన్న యువ రక్తం ఉరకలేస్తుందని అందువల్ల ఇప్పుడు దూకుడుగా జగన్ నిర్ణయాలు తీసేసుకుంటున్నారని అలా కాకుండా రాష్ట్రం ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉంది కావున కాస్త ఆలోచించి కూడా నిర్ణయాలు తీసుకుంటే మంచిదని తన అభిప్రాయం వ్యక్తం చేసారు.అలాగే ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు హామీలు పూర్తి స్థాయిలో బడ్జెట్ తోనే కనుక పూర్తి చేసినట్లతే మంచి భవిష్యత్తు ఉంటుందని అలా కాకుండా కేవలం వార్తా పత్రికల్లోనూ న్యూస్ ఛానెల్స్ లోను మాత్రమే పరిమితం అయితే అది జగన్ కే మంచిది కాదు అని స్పష్టంగా చెప్పేసారు.