బిగ్ న్యూస్: పవన్ కళ్యాణ్ కి షాకిచ్చిన రాపాక వరప్రసాద్…అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే!

Wednesday, December 11th, 2019, 11:09:33 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగా చేస్తున్న పోరాటం అంతా ఇంతా కాదు. కేవలం తాను నమ్మిన సిద్ధాంతాల కోసం 151 సీట్లు గెలిచిన వైసీపీ ప్రభుత్వానికి పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం మీద పెద్ద ఉద్యమమే నడిచింది. చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అయితే నేడు జరిగిన అసెంబ్లీ సమావేశం లో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు.

ప్రభుత్వ పాఠశాలలో పేదవాళ్ళు, దళితులు మాత్రమే చదువుతున్నారని, సమర్థత కలిగిన వాళ్ళు వారి పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపుతున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక అన్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఆంగ్ల మాధ్యమం నిర్ణయం చాల మంచిది అని రాపాక వరప్రసాద్ అన్నారు. అయితే పవన్ ఎన్నో రోజులు జగన్ ఫై విమర్శలు చేసి, ఎంతో పోరాటం చేసారు. జగన్ మోహన్ రెడ్డి ఫై ఎన్నో విమర్శలు పెద్ద స్థాయిలో చేసారు. అయితే జనసేన ఎమ్మెల్యే రాపాక ఈ వ్యాఖ్యలు చేయడం తో జనసైనికులు, జనసేన నాయకులు షాక్ లో వున్నట్లుగా తెలుస్తుంది.