బ్రేకింగ్ న్యూస్ : మలికిపురం ఎస్సై విషయంలో రాపాక సంచలన నిర్ణయం!

Friday, August 16th, 2019, 04:42:18 PM IST

గత కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీకు చెందినటువంటి ఒక్కగానొక్క ఎమ్మెల్యే విషయంలో పెద్ద దుమారం చెలరేగిన సంగతి అందరికి తెలిసిందే.ఒక చిన్న కారణం చేత మలికిపురం పోలీసు స్టేషన్ కు చెందినటువంటి ఎస్సై రాపాక వర ప్రసాద్ పై దుర్భాషలాడడం జనసేన శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.అంతేకాకుండా ఒక విలేఖరిని అతని ఇంటి దగ్గరకు వెళ్లి మరీ కొట్టినా సరే ఆ వైసీపీ ఎమ్మెల్యే పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సైతసైతం ఆగ్రహం తెప్పించింది.

ఇదిలా ఉండగా చిన్న కారణాన్ని చూపించి అరెస్ట్ చేసేంత వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో రాపాక తనంతట తాను స్టేషన్ కు వెళ్లగా జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.ఆఖరకు అధినేత తాను రోడ్డు పైకి రావాల్సి వస్తుందని చెప్పేసరికి రాపాక బయటకు వచ్చారు.కానీ రాపాక మరియు అక్కడ జనసేన శ్రేణులు ఈ విషయాన్ని అంత తేలిగ్గా అయితే తీసుకోవడం లేదు.ఆ ఎస్సై రామారావును సస్పెండ్ చెయ్యాలని కాకినాడ జిల్లా కలెక్టర్ అయినటువంటి మురళిధర్ రెడ్డి వద్ద డిమాండ్ చేసారు.

అంతే కాకుండా క్యాబినెట్ లో ముగ్గురు దళిత మంత్రులు ఉన్నా సరే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.రామారావును కానీ సస్పెండ్ చెయ్యని పక్షంలో ఏకంగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతానని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా జనసైనికులు కూడా అతన్ని విధుల్లోనుంచి తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.