జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి వెంకట్రామ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రామ్ వైసీపీలో చేరుతున్న సమయంలో తండ్రి రాపాక వరప్రసాద్ ఆయన వెంటే ఉన్నారు. అయితే జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే రాపాక వ్యూహాత్మకంగా తన కుమారుడిని వైసీపీలోకి పంపించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాజోల్ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున రాపాక వరప్రసాద్ గెలుపొందారు. అయితే జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో రాపాక పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పుడు గట్టిగా వినిపించింది. అయితే పార్టీలో ఒక్కడినే ఉండి ఏమీ చేయాలనుకున్నాడో ఏమో తెలీదు కానీ మెల్లగా జనసేనకు దూరమై వైసీపీకి చేరువయ్యాడు. సీఎం జగన్పై ప్రశంసలు కురిపిస్తూ వైసీపీకి పూర్తి మద్ధతు తెలుపుతూ వస్తున్నాడు.