బిగ్ బ్రేకింగ్: జనసేన ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. రంగంలోకి దిగనున్న పవన్..!

Thursday, June 13th, 2019, 01:13:58 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ విజయదుందుభి మోగించింది. అయితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది వైసీపీ. అంతేకాదు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ఈ ఎన్నికలలో అధికారంలో ఉన్న టీడీపీకి, వైసీపీకి గట్టి పోటీ ఇస్తుందనుకున్న జనసేన చేతులెత్తేసింది. అయితే ఈ ఎన్నికలలో అందరి అంచనాలు తారుమారయ్యాయి. అధికార టీడీపీకి కూడా ప్రతిపక్ష హోదా కూడా దాక్కలేదు. కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది టీడీపీ. ఇక జనసేన మాత్రం కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితం అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా ఓడిపోయాడు.

అయితే జనసేనలో రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు 800 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఈయన పార్టీ మారుతున్నరంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా జనసేన ఎమ్మెల్యేగానే ప్రమాణస్వీకారం చేసారు రాపాక వరప్రసాద్. అయితే సమావేశాలు ముగిసిన అనంతరం రాపాక సీఎం జగన్‌ను కలిసారు. అయితే సీఎం జగన్‌ను కలిసిన అనంతరం రాపాక మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిసానని తాను పార్టీ మారడం లేదని చెప్పుకొచ్చాడు.

అయితే రాపాక భయటకు అలా చెబుతున్నారే కానీ లోలోపల మాత్రం పార్టీ మారబోతున్నట్టు రాజకీయ వర్గాలలో అనుమానాలు వస్తున్నాయట. అయితే జగన్ మాత్రం తనతో భారీ మెజారిటీ ఉండడంతో ఎవరు పార్టీలోకి వచ్చినా తమ పదవికి, వారి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని జగన్ ఇదివరకే చెప్పారు. అయితే అభివృద్ధి దృష్ట్యా వైసీపీలోకి వెలితే బాగుంటుందని జనసేన ఎమ్మెల్యే రాపాకా భావిసున్నారట. అందుకోసం రాజీనామాకు సిద్దపడి జనసేన పార్టీకీ కూడ గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు తెగ ప్రచారమవుతుంది. అయితే ఇదే కనుక జరిగితే రాజోలులో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందట. అయితే ఒక వేళ ఉప ఎన్నికలు జరిగితే ఈ సారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీకీ దిగుతారని, జనసేనకు మంచి బలం ఉండడంతో పవన్ అక్కడ హీజీగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడంటూ పెద్ద ఎత్తున చర్చలు నడుస్తునాయి.