జనసేన పార్టీ అత్యవసర సమావేశం – అసలు పార్టీలో ఏం జరుగుతుంది…?

Wednesday, October 16th, 2019, 08:39:10 PM IST

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా ఒక కీలమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని సమాచారం. పార్టీ పరంగా తమ పార్టీ నేతలతో అత్యవసరమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడనికి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు. కాగా పార్టీకి సంబందించిన ముఖ్యమైన నేతలందరు కూడా పార్టీ కి గుడ్ బై చెప్పి, ఏపీలోని అధికార వైసీపీ పార్టీలో చేరుతున్నారు. దానితో రాజకీయాల్లో తీవ్రమైన పెను మార్పులు రానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి జనసేన పార్టీ పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.

కాగా ఈ నెల 18వ తేదీన జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం, 20వ తేదీ ఉదయం రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరపడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈసమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, పార్టీలో చేయాల్సిన కీలక మార్పుల కోసం చర్చలు జరపనున్నారు. కాగా ఈ సమావేశం హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ పార్టీ కార్యాలయంలో జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే పార్టీలో వస్తున్న మార్పులపై అన్వేషణ జరిపి, పార్టీ వీడాలనుకునేవారితో చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ఇవి ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.