బిగ్ బ్రేకింగ్: జనసేనకు ఆయన రూపంలో మరో ఎదురు దెబ్బ తగలనుందా..!

Monday, June 10th, 2019, 03:14:13 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో గెఉపు కోసం కాదు మార్పు కోసం పోటీ చేస్తున్నామని ప్రధాన పార్టీలకు సైతం గట్టి పోటీ ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ. అయితే ఫలితాలకు ముందు జనసేనపై ఉన్న నమ్మకం ఫలితాల తరువాత ప్రజలలో కానీ, పార్టీ శ్రేణులలో కానీ కనిపించడంలేదు. దానికి కారణం ఒక్కటే జనసేన దాదాపు అన్ని స్థానాలలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం. అంతేకాదు జనసేన అధినేత రెండు స్థానాలలో పోటీ చేసి రెండింటిలో ఓటమి పాలవ్వడం. అయితే జనసేనలో ఎన్నికల సమయంలో పార్టీలో కీలకంగా ఉన్న వారంతా ఇప్పుడు పార్టీనీ వీడే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే పార్టీ నుంచి కొంత మంది నేతలు తప్పుకున్నారు. అయితే తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా పార్టీ నుంచి తప్పుకుంటున్నానని అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ కూడా రాసారు. అంతేకాదు ఈయన ఇప్పుడు బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జనసేనలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ వీడబోతున్నారంటూ రాజకీయ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా గుంటూర్ జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి నాదెండ్ల హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలు కాస్త మరింత బలపడ్డాయి. అయితే దీనిపై స్పందించిన జనసైనికులు మాత్రం ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ అమెరికా పర్యటనలో ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమానికి హాజర్ కాలేకపోయారని దీనిని కొంతమంది రాజకీయం చేస్తూ నాదెండ్ల మనోహర్ పార్టీ వీడుతున్నాడంటూ విష ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా అసలు నాదెండ్ల పార్టీనీ వీడే ప్రయత్నమే చేయడంలేదంటూ చెప్పుకొస్తున్నారు.