బిగ్ బ్రేకింగ్ : వైసీపీలో చేరనున్న జనసేన కీలక నేత..!

Tuesday, October 8th, 2019, 02:41:06 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు రోజుకొక షాక్ తగులుతూనే ఉంది.తన పార్టీలోనే అంతర్గత చీలికలు రావడం ఆ పార్టీ నుంచి చాలా మంది బయటకు వెళ్లిపోవడం వంటివి జనసేన శ్రేణులకు తలనొప్పిగా మారుతున్నాయి.ఎన్నికల తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందని అందుకే తాము వెళ్ళిపోతున్నామని కొంతమంది అంటున్నా మరికొంత మంది మాత్రం తమ స్వలాభాల కోసం పార్టీలోకి వచ్చి చేసి ఓటమి పాలయ్యాక ఇతర పార్టీలలోకి జంప్ అయ్యిపోతున్నారు.

అయితే తాజాగా జనసేన పార్టీకు చెందిన మరో కీలక నేత అయినటువంటి ఆకుల సత్యన్నారాయణ ఆ పార్టీను వీడారన్న వార్తలు బయటకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే.కానీ ఈయన ఇప్పుడు వైసీపీలోకి చేరుతున్నారన్న వార్త బయటకు వచ్చింది.జనసేన శ్రేణులు ఏ పార్టీను అయితే తీవ్రంగా టార్గెట్ చేసారో అదే పార్టీలోకి ఈయన చేరడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి.మరి జనసేన పార్టీ నుంచి ఇక ముందు కూడా ఇలాగే వలసలు కొనసాగుతాయా లేక ఇలాంటి వారి అందర్నీ పవనే బయటకు పంపిస్తారా అన్నది చూడాలి.