సీఎం జగన్ కి నాగబాబు అభినందనలు…మరొక విన్నపం ఏంటంటే?

Tuesday, May 26th, 2020, 07:53:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా టీటీడీ భూముల విషయం పై రాజకీయ పరంగా కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే టీటీడీ భూములు విషయంలో అమ్మకాన్ని నిలిపివేసి నందుకు గానూ నటుడు, జన సేన పార్టీ నేత నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అభినందనలు అని వ్యాఖ్యానించారు. అలానే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్వైరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి అని వ్యాఖ్యానించారు.అంతేకాక జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యవహారం పై జన సేన, బీజేపీ, వైసీపీ పార్టీ నేతలు ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఉపవాస దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం లో వైసీపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ తీరు ను ఎండగడుతూ నిలదీస్తున్నారు. అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యలు పై వైసీపీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరు లానే కొనియాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.మరి దీని పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.