హాట్ టాపిక్: మరోసారి జగన్ పై పవన్ తిరుగుబాటు

Monday, October 21st, 2019, 08:32:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజా పోరాటం ఏదైనా సరే జగన్ కి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేసేలా వున్నాయి. పవన్ కళ్యాణ్ నవంబర్ 3 న భారీ ర్యాలీ ని చేపట్టబోతున్నారని జనసేన పార్టీ తెలిపింది. ఇసుక కొరత కారణంగా కార్మికులు చాల ఇబ్బంది పడుతున్న విషయం అందరికి తెలిసిందే. దాదాపు లక్ష మంది కార్మికుల కి ఉపాధి దొరకలేని పరిస్థితి, భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ చేస్తున్న ఈ లాంగ్ మార్చ్ లో జనసైనికులు, ప్రజలు, కార్మికులు, జనసేన నాయకులు ఇతరులు పాల్గొననున్నారని సమాచారం.

ఇప్పటివరకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వం పై అంతగా విమర్శలను గుప్పించేలా లేవు. పోలవరం రివర్స్ టెండరింగ్, ఇసుక కొరత, పవర్ కట్, రైతు భరోసా లాంటి పేరొందిన పథకాల పై కూడా విమర్శలు వచ్చాయి. అయితే కొద్దీ మొత్తం లో అయినా జగన్ బాగానే ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఇచ్చిన హామీల ప్రకారం త్వరితంగా ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. కానీ కార్మికుల విషయం లో వస్తున్న ఈ పరిస్థితుల పై జగన్ స్పందన లేకపోవడం తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి జగన్ ఈ విషయం లో ఎలా స్పందిస్తారో తెలియాలి.