బిగ్ బ్రేకింగ్: టీడీపీ, వైసీపీ లకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జనసేన

Monday, October 21st, 2019, 11:49:39 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దూకుడు గా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క ప్రజా సమస్యల పై పోరాటం చేస్తూనే, మరో పక్క టీడీపీ మరియు వైసీపీ నేతల పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి నిర్ణయం ఈ రెండు పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తరహాలోనే ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని జనసేన పార్టీ ఆరోపిస్తుంది.

చంద్రబాబు అధికారం లో వున్నపుడు ప్రజాధనాన్ని తన విలాసాలకు వినియోగించిన తీరుని గుర్తు చేసారు జనసేన. చంద్రబాబు డిన్నర్ కి ఖర్చు పెట్టిన వివరాలను ఒక ఫోటో ద్వారా తెలిపే ప్రయత్నం చేసారు జనసేన పార్టీ. అలాగే ప్రస్తుత ముఖ్య మంత్రి తన వ్యక్తిగత కేసులో హైకోర్టు కి హాజరు కావడానికి కొన్ని కోట్ల రూపాయల్ని వెచ్చిస్తున్నాడని జనసేన అభిప్రాయపడుతోంది. జగన్ హాజరయ్యే ప్రతి సరి 60 లక్షల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారు అంటూ జనసేన ఆరోపిస్తుంది. అందుకే ప్రజల కష్టాల్ని దోచుకుతినడం లో చంద్రబాబు ని జగన్ ఆదర్శం చేసుకున్నారని జనసేన పార్టీ ఆరోపిస్తుంది.